1068
<span style="font-family: Mandali; ">ఫేస్‌బుక్ </span> Twitter instagram Youtube

గుండె వైఫల్యానికి గల 5 కారణాల గురించి మీరు తెలుసుకోవాలి

గుండె వైఫల్యానికి గల 5 కారణాల గురించి మీరు తెలుసుకోవాలి
Query Form

గుండె వైఫల్యం అనేది గుండె శరీరమంతటా రక్తాన్ని పంప్ చేయలేకపోవడం వల్ల కలిగే లక్షణాల సమూహం. రక్త ప్రవాహం సరిపోనప్పుడు శరీరంలోని అన్ని ప్రధాన విధులు దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో, రోగులలో గుండె కండరం గట్టిపడవచ్చు, దీని ఫలితంగా గుండెకు రక్త ప్రవాహం నిరోధించబడుతుంది.

గుండె వైఫల్యం మీ గుండె యొక్క కుడి లేదా ఎడమ భాగాన్ని ప్రభావితం చేయవచ్చు మరియు లక్షణాల వ్యవధిని బట్టి ఇది తీవ్రమైన లేదా దీర్ఘకాలిక పరిస్థితిగా వ్యక్తమవుతుంది.

గుండెను దెబ్బతీసి, గుండె వైఫల్యాలకు కారణమయ్యే పరిస్థితులు

 కొరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD)
 

మీ ధమనులలో ప్లాక్ అని పిలువబడే జిడ్డుగల పదార్థం పేరుకుపోయి గట్టిపడినప్పుడు, కొంత కాలం తర్వాత అది మూసుకుపోయిన పైప్‌లైన్ లాగా ధమనులు కుంచించుకుపోవడానికి దారితీస్తుంది. ఈ పరిస్థితిని అథెరోస్క్లెరోసిస్ అంటారు. దీని ఫలితంగా ధమనుల మార్గాలు సన్నబడటం కొనసాగడంతో, గుండెకు మరియు గుండె నుండి ప్రయాణించే రక్త సరఫరా తగ్గిపోతుంది. క్రమంగా, గుండె కండరాలు బలహీనపడటంతో ఇది గుండె వైఫల్యానికి దారితీస్తుంది.

 గుండెపోటు

మీ గుండెలోని ఒక ప్రాంతానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో అనుకోకుండా అడ్డంకి ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. సాధారణంగా, ప్లాక్ అని పిలువబడే కొవ్వు పదార్థాలు ధమనులలో పేరుకుపోయి, వాటిని సన్నబరచడం వల్ల ఈ అడ్డంకి ఏర్పడుతుంది. ఈ అడ్డంకికి చికిత్స చేయకుండా వదిలేస్తే, కాలక్రమేణా గుండె కండరానికి జరిగే నష్టం కోలుకోలేనిదిగా మారవచ్చు. గుండెపోటును మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ లేదా కరోనరీ థ్రాంబోసిస్ అని కూడా అంటారు.

 అధిక రక్త పోటు

అధిక రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్ వల్ల, కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు ఇతర పదార్థాలు (వీటన్నింటినీ కలిపి ప్లాక్ అంటారు) పేరుకుపోవడం వలన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులపై అధిక ఒత్తిడి పడి , అవి తీవ్రంగా సన్నబడతాయి. ఇది అథెరోస్క్లెరోసిస్ అని పిలువబడే ఒక నెమ్మదైన ప్రక్రియ, ఇది రక్తపు గడ్డలకు దారి తీస్తుంది, దీనివల్ల గుండె కండరానికి ఆక్సిజన్ మరియు పోషకాలు అందవు. చివరికి, గుండె కండరానికి కలిగే ఈ నష్టాన్నే గుండెపోటు అంటారు.

డయాబెటిస్

మీ రక్తంలోని చక్కెరను శక్తి కోసం ఉపయోగించుకునేలా కణాలకు తరలించడం ఇన్సులిన్ పని. మీకు మధుమేహం ఉన్నప్పుడు, మీ శరీరం చక్కెరను శక్తిగా మార్చడానికి ఇన్సులిన్‌ను ఉపయోగించుకోదు లేదా తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. దీనివల్ల రక్తంలో అదనపు చక్కెర మిగిలిపోయి, మీ ధమనులకు హాని కలిగించి, గుండె వైఫల్యానికి దారితీయవచ్చు.

అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (లేదా OSA)

నిద్రలో శ్వాసనాళం పై పొర కుప్పకూలినప్పుడు లేదా మూసుకుపోయినప్పుడు వచ్చే OSA అనేది స్లీప్ అప్నియాలో అత్యంత సాధారణమైన రూపం. ఊబకాయం ఈ సమస్యకు దోహదపడవచ్చు, కానీ ఇది ఊబకాయం లేని వ్యక్తులలో కూడా కనిపిస్తుంది.
 
స్లీప్ అప్నియాకు, గుండె వైఫల్యానికి ఈ క్రింది విధంగా సంబంధం ఉంది: ఒక వ్యక్తి శ్వాస తీసుకోవడం ఆపివేసినప్పుడు, ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి, దీనివల్ల శరీరం అడ్రినలిన్ అనే ఒత్తిడి హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది నిరంతరంగా కొనసాగితే, కాలక్రమేణా అది అధిక రక్తపోటుకు దారితీస్తుంది, తత్ఫలితంగా, గుండె వైఫల్యం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
 
ఒత్తిడిని మెరుగ్గా నిర్వహించడం, శారీరకంగా చురుకుగా ఉండటం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా, ప్రమాద కారకాలను నియంత్రించడం లేదా తొలగించడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చు.

Dr. Sanjay Mittal
తిరిగి పైకి